-
బీసి గర్జన సభకు తరలి రండి
-
తీన్మార్ మల్లన్న టీం రవి పటేల్
సూర్యజ్యోతి, మల్హర్, నవంబర్ 02 : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరగనున్న బీసి గర్జన సభకు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బీసి కులాల నాయకులు, ప్రజానీకం తరలి రావాలని తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. ఈ సభలో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను చర్చిస్తామన్నారు. రాజకీయ పరంగా వెనక్కి నెట్టి వేయబడ్డ తీరు, బీసి కులాల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య దోరణి ఈ సభ ద్వారా ప్రభుత్వానికి చాటి చెప్పుదామని అన్నారు. జనాభాలో మనం ఎంత ఉన్నామో మనకు అంత వాటా అని ఈ సభ ద్వారా ఎలుగెత్తి చాటుదాం అని రవి పటేల్ పిలుపునిచ్చారు.