సూర్యజ్యోతి, నవంబర్ 04, ఎల్కతుర్తి : మండలంలోని రైతులు ఖరీఫ్ వరిపంట కోతలు పూర్తి చేసి ఇరవై రోజులు గడుస్తున్నా ప్రభుత్వం గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రం కొనుగోళ్ళు ఇంకా ప్రారంభించక పోవడం బాధాకరమని సీపిఐ మండల కార్యదర్శి ఉట్కూరు రాములు ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అదికార యంత్రాంగం తూతూ మంత్రంగా మండలంలోని దండేపల్లి, బావుపెట, గోపాల్ పూర్ గ్రామల్లో కొనుగోలు కేంద్రాలు తెరిచి చేతులు దులుపుకున్నారు అని అన్నారు. తుఫాన్ ప్రభావంతో అడపాదడపా కురుస్తున్న చిరుజల్లుల తొ మండల రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైస్ మిల్లులకు ఇంకా అటాచ్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వక పోవడంతో మిల్లర్లు ముందుకు రావడంలేదు అన్నారు. ఇదె అదనుగా దళారులు పంటను కల్లాల వద్దనే తూకాలు వేస్తూ తమకు నచ్చిన ధర పెడుతూ రైతులను దోచుకుంటున్నారు అని ఆయన ఆరోపించారు. యిదే కాకుండా గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. లలితంగా ప్రజలు కార్డులు లేక అనేక ప్రభుత్వ పథకాలకు దూరం అయ్యారని పేర్కొన్నారు. ఈ నెల ఆరవ తేదీ నుండి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక చేస్తున్న నేపథ్యంలో కార్డులు లేనివారు నష్టపోకుండా రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాతే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ప్రక్రియ చేపట్టాలని ఉట్కూరు రాములు డిమాండ్ చేశారు.
కోతలు పూర్తయి ఇరవై రోజులు.. మరి కొనుగోలుకు ఇంకెన్ని రోజులు?? – సీపిఐ మండల కార్యదర్శి ఉట్కూరు రాములు
Date: