సూర్య జ్యోతి, భీమదేవరపల్లి నవంబర్ 02 : భీమదేవరపల్లి మండలంలో కులగణన సర్వే లోని ప్రారంభ అంకం సోషియో ఎకనామిక్ సర్వే నేడు ప్రారంభం అయ్యింది. మండలంలోని గాంధీ నగర్, మానిక్యపూర్, కోప్పుర్, భీమదేవరపల్లి, ముల్కానూర్, వంగర, గట్ల నర్సింగపూర్, ఎర్రబెల్లి, ముత్తారం, ముస్తఫ పూర్, రంగయ్య పల్లి, కొత్తపల్లి, చాపగాని తండా, బోల్లోని పల్లి తదితర గ్రామాల్లో ఎన్యుమరెటర్లు, బీ .ఏల్. వో లు ఇంటింటికీ వెళ్లి గృహాలకు హౌస్ లిస్టింగ్ చేశారు. ఇది పూర్తయిన అనంతరం ఆరవ తేది నుండి సమగ్ర కులగణన మొదలు కానుంది.