సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి టి రాజగోపాల్
సూర్య జ్యోతి, నవంబర్ 3, హైదరబాద్ : కులగణన పేరుతో ఆస్తుల వివరాలు ఎందుకు అని పన్నులు చెల్లిస్తున్న వారికి ప్రభుత్వం అదనంగా ఏమయినా ఇస్తుందా అని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ హైదరాబాద్ కన్వీనర్ సయ్యద్ తోఫిక్ అలీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు వర్తింపచేయకుండా వేధిస్తున్నది చాలదా.. కులాల వారీగా వివరాలు తీసుకోవాల్సిన సర్వేలో ఇతర వివరాలు ఎందుకు ఆని ఆయన అన్నారు. రాజకీయ పదవుల గురించి ఎందుకు అడుగుతున్నారు. వార్షిక టర్నోవర్ వివరాలు సేకరించడం వెనక అంతర్యం ఏమిటి.. ? ప్లాట్ల వివరాలు, భూముల వివరాలు ప్రభుత్వానికి ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ప్లాటు కొన్నా, భూములు కొన్నా ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారు కదా.. నివాస గృహాల వివరాల సేకరణ వెనక మర్మం ఏమిటి అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.