అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికా – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
సూర్య జ్యోతి, నవంబర్ 3, హనుమకొండ జిల్లా : వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్ హంటర్ రోడ్డులోని భద్రకాళి ట్యాంక్ బండ్ స్థానిక వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సి బస్వారాజు సారయ్య, జిల్లా కలెక్టర్ లు ప్రవీణ్య, సత్య శారదా లతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆదివారం పరిశీలించారు. అనంతరం బండ్ ఆవరణలో కలియ తిరిగిన మంత్రి, ఇరిగేషన్, కూడా (KUDA) అధికారులతో చెరువు పూర్తి విస్తీర్ణం చేయాల్సిన పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో ఆలయ ప్రధానార్చకులు పూర్ణకుంభంతో మంత్రిని, ఎమ్మెల్యేలను స్వాగతం పలికి అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు వేదమంత్రాల మధ్య మంత్రులను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ, ఇతర ప్రజా ప్రతినిధులను ఆశీర్వదించారు. అనంతరం మాడ విధుల పనుల పురోగతిని మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఆయా శాఖల ఉన్నతధికారులతో పాటు తదితరులు ఉన్నారు.