– ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే నా ఎజెండా – ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
సూర్య జ్యోతి, హనుమకొండ జిల్లా, నవంబర్ 02 : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని నల్గొండ- ఖమ్మం -వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలు సందర్శించి ఉపాధ్యాయులను, అధ్యాపకులను కలిసి అందరూ ఓటు నమోదు చేసుకోవాలని, ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా నర్సిరెడ్డి గారు కోరారు. అనంతరం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ,కాకతీయ డిగ్రీ కళాశాల, ఆర్ట్స్ కళాశాల, ప్రాక్టీస్ ఉన్నత పాఠశాలల్లో జరిగిన సమావేశంలో నర్సిరెడ్డి మాట్లాడుతూ గత ఐదున్నర సంవత్సరాలుగా ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యల పరిష్కారం కోసం మండలి వేదికగా అనేక పోరాటాలు చేశానని, కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని ఈ సందర్భంగా నర్సిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయుల బదిలీలు, ఉపాధ్యాయులకు 30% మెరుగైన ఫిట్మెంట్, పాఠశాలలో సర్వీస్ పర్సన్స్ నియామకం ,పాఠశాలల, కళాశాలల అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న నాలుగు విడతల కరువుబత్యాన్ని విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ,ఉపాధ్యాయులకు డైట్ లెక్చరర్లు, డిప్యూటీవోలుగా ప్రమోషన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే రెగ్యులర్ చేయాలని , కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైమ్స్ స్కేల్ ఇవ్వాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో యూనివర్సిటీ కాంట్రాక్టర్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ కుమార్ లోడీ,ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఏ సంజీవయ్య, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆసనాల శ్రీనివాస్ ,టీఎస్ యుటిఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ రవీందర్ రాజు ,పెండెం రాజు , యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ కుమార్ లోది అంజన్ రావు తదితరులు పాల్గొన్నారు