సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి టి రాజగోపాల్
సూర్య జ్యోతి, నవంబర్ 5, న్యూఢిల్లీ : కోర్టులు ఇచ్చే తీర్పులను నిష్పక్షపాతంగా విమర్శించే హక్కు మీడియాకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కు అయిన భావప్రకటనా స్వేచ్ఛలో ఇది భాగమేనని తెలిపింది. తీర్పులను సహేతుకంగా విమర్శించటంనేరం కాదని, అదొక హకు అని పేర్కొంది. న్యాయమూర్తులతో సహా ఎవరూ లోపరహితులు కాదని.సద్విమర్శలను ప్రోత్సహించాలని తెలిపింది. కేంద్రమానవవనరుల మంత్రి కపిల్ సిబాల్, ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆ పత్రికా విలేకరిల పై దాఖలైన కోర్టు ఉల్లంఘన కేసుపై మంగళవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. 1995 లో న్యాయవాదిగా ఉన్న సిబాల్.. న్యాయవ్యవస్థలో పేరుకు పోయిన అవినీతి పై టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఒక వ్యాసం రాశారు. దాని పై కోర్టు ఉల్లంఘన కేసు నమోదైంది.