అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం..
సూర్యజ్యోతి ఆత్మకూరు మండల రిపోర్టర్
- సమగ్ర కుటుంబ కుల గణన ఇంటింటి సర్వే..
సూర్య జ్యోతి, నవంబర్ 07, పరకాల : పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో ఇంటింటా సమగ్ర కుటుంబ కుల గణన సర్వే కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని, అనంతరం డోర్స్ కి స్టిక్కర్స్ వేస్తూ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ కుల గణన ఇది దేశంలోనే మొదటి సర్వే అని, ఈ సర్వే దేశంలోనే ఆదర్శ సర్వేగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరు సమాజంలో ఏ స్థాయిలో ఉన్నారో ఈ సర్వేతో తెలుస్తుందని అన్నారు. ప్రతి 150 ఇండ్లకు ఒక ఎన్యూములేటర్ ను నియమించారని వారు ప్రతి ఇంటికి వచ్చి స్టిక్కర్ వేసి సర్వ్కు కావల్సిన పత్రాలను ముందుగా వివరిస్తారని అన్నారు. నియోజకవర్గంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందిగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్యూములేటర్లు, అధికారులు ప్రతీ కుటుంబానికి ముందస్తు పూర్తి సమాచారం ఇచ్చి ప్రజలకు సహకరించి సర్వే పూర్తి చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ నారాయణ, తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కమలాపురం రమేష్, మాజీ జెడ్పిటిసి కక్కర్ల రాధిక రాజు, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్, ఎంపీఓ విమల, పంచాయతీ కార్యదర్శి రవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.