సూర్యజ్యోతి ప్రతినిధి, భీమదేవరపల్లి నవంబర్ 02 : హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముస్తఫా పూర్ గ్రామానికి చెందిన మద్దెల రాజ కొమురయ్య మల్లమ్మ దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు… అందరికీ పెళ్లిళ్లు చేశారు. ఆరేళ్ళ క్రితం మల్లమ్మ మృతి చెందారు. రాజ కొమురయ్య ఒంటరిగా ఉంటున్నాడు. అనంతరం ఆయన కొడుకు రవి తండ్రి పేరిట ఉన్న 4.12 ఎకరాల భూమిని తన పేరిట పట్టా చేసుకున్నాడు. అప్పటి నుండి తండ్రి బాగోగులను పట్టించుకోవడం మానెశాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు పెట్టగా వారిముందు కూడ తండ్రి పై దాడి చెశాడు. మానసికంగా కుంగిపోయిన తండ్రి కొడుకు పేరిట ఉన్న పట్టా రద్ధు చేయలని హన్మకొండ ఆర్డీవో, భీమదేవరపల్లి తహశీల్దార్ ముల్కనూర్ పోలిస్ స్టేషన్ లలో లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసి కొడుకుకు భయపడి పెద్ద పాపయ్య పల్లిలోని ఒక రైస్ మిల్లులో నైట్ వాచ్ మెన్ గా పనిచేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. విచారణ చేపట్టిన ఆర్డివో, భీమదేవరపల్లి తహశీల్దార్ సీనియర్ సిటిజన్ ఆక్ట్ క్రింద రవి పట్టా పొందిన భూమి లో నుండి 3.20 ఎకరాల భూమిని తిరిగి తండ్రి పేరిట ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసి పట్టా తండ్రి రాజ కొమురయ్య చేశారు. ఈ సందర్భంగా ఆయన సూర్యజ్యోతి ప్రతినిధి తొ మట్లాడుతూ… వృద్దాప్యంలో ఉన్న తండ్రి బాగోగులు కొడుకే చూడాలని, తన కుమారుడి తీరుతో ఒక దశలో భూమిని ఏదైనా అనాథ శరణాలయం కు రాయనుకున్నానని, నా కొడుకు నా బాగోగులను చూడకుండ దాడి చేసి కొడుతున్నాడు అని 75 ఏళ్ల వయసులో నైట్ వాచ్ మెన్ గా పనిచేసుకుంటూ బతుకుతున్నా.. నాలాంటి పరిస్థితి లోకంలో ఎ తండ్రికి రాకుడడని రాజ కొమురయ్య తన గోడు వెల్లబోసుకున్నాడు.