హనుమకొండలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న సేవాలాల్ సేన హనుమకొండ వరంగల్ జిల్లా అధ్యక్షులు కునుసోతు మురళి నాయక్
సూర్య జ్యోతి, నవంబర్ 20, హనుమకొండ : హనుమకొండలో రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా హనుమకొండ కాలేజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవ ఉత్సవాలకు వచ్చిన రేవంత్ రెడ్డి కాన్వాయ్ ని హనుమకొండ, వరంగల్ జిల్లా సేవాలాల్ సేన నాయకులు కొడంగల్ లగచర్లలో రైతులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని హనుమకొండలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ ని సేవాలాల్ సేన అనుమకొండ వరంగల్ జిల్లా అధ్యక్షులు మురళి నాయక ఆధ్వర్యంలో అడ్డుకోవడం జరిగింది. అనంతరం పోలీసు బలగాలు వారిని అరెస్టు చేసి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవాలాల్ విద్యార్థి సేన జిల్లా నాయకులు అశోక్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు మోహన్ నాయక్, జిల్లా యువసేన నాయకులు నవీన్ నాయక్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అఖిల్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా నాయకులు వీరు నాయక్, హసన్పర్తి మండల అధ్యక్షులు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.