పంచకూట శివాలయ పునః ప్రతిష్టాపన
- కార్యక్రమంలో పాల్గొన్న ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డా.పి. వివేకానంద రెడ్డి
సూర్యజ్యోతి ఆత్మకూర్ మండల్ రిపోర్టర్ : ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆత్మకూరు మండల కేంద్రంలో శ్రీ పార్వతీ సమేత మహాదేవ స్వామి పంచకూట ఆలయ పునః ప్రతిష్టా కుంభాభిషేక మూడు రోజులు నిర్వహించే మహోత్సవం సందర్భంగా వేడుకల్లో పాల్గొనే భక్తుల కోసం ప్రతీ రోజు 10,000 మందికి మించి భోజనాలను, ప్రసాద వితరణ కోసం ఇనగాల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కీ.శే. సుజిత – అమరెందర్ రెడ్డి జ్ఞాపకార్ధం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇనగాల చారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ డా.పి. వివేకానంద రెడ్డి గణపతి పూజలో పాల్గొన్న అనంతరం వేడుకలో పాల్గొన్న భక్తులకు బోజనాలను వడ్డించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ప్రజలందరూ ఆ దేవదేవుని అనుగ్రహంతో సుఖ శాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నారు.