సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి టి రాజగోపాల్
సూర్య జ్యోతి, నవంబర్ 4 : రేపు సా.4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడి నుంచి బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలు, విద్యా వేత్తలతో సమావేశమై కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఈ సమావేశానికి సుమారు 400 మందికి కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఆహ్వానం అందింది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారని పోలీసు అధికారులు తెలిపారు.