ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి
హనుమకొండ జిల్లా, పరకాల, నవంబర్ 8, (సూర్య జ్యోతి నాగరాజు) : నడికుడా మండల కేంద్రంలోని నర్సక్కపల్లి గ్రామానికి చెందిన నేతుల ప్రమీల, బండి సుమలత, గుండా సత్యనారాయణ,జంక్కాజువ ఎల్లస్వామి గారికి పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి కల్యాణలక్ష్మి, సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నడికుడా మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి తలగంప రాజు సీనియర్ నాయకులు కోడెపాక ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.