-
యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం శివ
సూర్యజ్యోతి ప్రతినిధి, భీమదేవరపల్లి : నియోజకవర్గం కేంద్రంలోని 50 పడకల ఆసుపత్రిని 150 పడకలకు అప్ గ్రేడ్ చేస్తూ దీనికి 82 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం ముమ్మాటికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనతే అని హుస్నాబాద్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం శివ అన్నారు. ఆయన సూర్యజ్యోతి ప్రతినిధి తొ మాట్లాడారు. ప్రతి పక్షాలు దీనిని తమ ఘనత అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. గత పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 30 పడకల ఆసుపత్రిని కేవలం 50 పడకలుగా మార్చారని ఈ అప్పుడు వారికి ఎందుకు లేదోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనను గెలిపించిన నియోజకవర్గం ప్రజల పట్ల మంత్రికి ప్రేమ ఉండబట్టే ముఖ్యమంత్రి దగ్గర గట్టిగా వాదించి ఈ ఘనత సాధించటం జరిగిందని అన్నారు. ఇకపై నియోజకవర్గం ప్రజలు నగరాల్లోని కార్పొరేట్ దావఖానాలా చుట్టు తిరిగి లక్షలు ఖర్చు పెట్టడం ద్వారా అప్పులపాలు అయ్యే భాద తప్పింది అన్నారు. అప్ గ్రేడ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చిన వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి క్రిస్టియానా కు గడ్డం శివ కృతజ్ఞతలు తెలిపారు.