సూర్య జ్యోతి, నవంబర్ 4, రిపోర్టర్ నాగరాజు, పరకాల : పరకాల పట్టణంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం మొదటి సోమవారంను పురస్కరించుకొని పరకాల వ్యవసాయ మార్కెట్ మాజి చైర్మన్, బిఆర్ఎస్ నాయకులు బండి సారంగపాణి ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాద కార్యక్రమమాన్ని పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. మొదటగా ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతున్ని కోరినట్లు వారు తెలిపారు. అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రారంభించారు. అన్నప్రసాద కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆయల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ మరియు పరకాల, నడికూడ మండలాల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.