– విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపడమే తమ లక్ష్యం.
– భవిత కళాశాల కరస్పాండెంట్ బాలరాజు.
సూర్య జ్యోతి, నవంబర్ 03, సదాశివపేట : భవిత కళాశాలలో దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా కళాశాల కరస్పాండెంట్ బాలరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదటగా అమ్మవారికి పూజలు నిర్వహించి, దీపావళి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భవిత కళాశాల కరస్పాండెంట్ బాలరాజు మాట్లాడుతూ దీపావళి పండుగతో అందరి జీవితాల్లో కూడా వెలుగులు వెలగాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగిందన్నారు. భవిత కళాశాలలో ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించి విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపడం మా భవిత కళాశాల యొక్క లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, రాజు కళాశాల లెక్చరర్లు పాల్గొన్నారు.