మండలంలో శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ
సూర్యజ్యోతి నవంబర్ 02, రామసముద్రం : ఎంపీడీవో భాను ప్రసాద్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని 19 పంచాయతీలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొన సాగుతోంది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు గ్రామ, సచివాలయ సిబ్బంది పెన్షన్‌దారుల ఇళ్లకు వెళ్లి మరీ పెన్షన్ డబ్బులను అందజేస్తున్నారు. సరిగ్గా దీపావళి పండుగ రోజు,ఒకటో తేదీనే పెన్షన్ రావడంతో పెన్షన్‌దారులు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు సరైన సమయానికి పెన్షన్ అందజేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 96.9% పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. ఒకే సమయంలో రాష్ట్రం మొత్తం పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరగడంతో సర్వర్ సమస్య తలెత్తింది మిగిలిన వారికి రేపు సచివాలయ సిబ్బంది 100% పంపిణీ చేయడం జరుగుతుంది.