తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా దిగజర్ల శ్రీనివాస్
సూర్య జ్యోతి ప్రతినిధి, నవంబర్, మహబూబాబాద్ : తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రానికి చెందిన దిగజర్ల శ్రీనివాస్ ఎంపిక అయ్యారు. గత దశాబ్ద కాలంగా సంఘం అభ్యున్నతికి కృషి చేస్తూ పద్మశాలి ల హక్కుల సాధనకు కృషి చేస్తున్న ఆయనకు రాష్ట్ర పద్మశాలి సంఘం స్టేట్ కమిటీలో స్థానం కల్పించింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన ఎంపిక కు సహరించిన, రాష్ట్ర అధ్యక్షులు వల్లకంటి రాజ్ కుమార్, జిల్లా అధ్యక్షులు వేముల వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణ, కోశాధికారి పెండెం రమేష్ లతో పాటు మహబూబాబాద్ జిల్లా, మరిపెడ పద్మశాలి ప్రతినిధులకు, కులస్తులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి సంఘం అభ్యున్నతికి కృషి చేస్తానని శ్రీనివాస్ తెలిపారు.