సూర్య జ్యోతి రిపోర్టర్ నాగరాజు, నవంబర్ 05, పరకాల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు నడికూడ మండల ప్రజలందరూ సహకరించి విజయవంతం చేయాలని నడికూడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ కోరారు. నడికూడ మండల కేంద్రంలో మంగళవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ గ్రామ కమిటీ అధ్యక్షుడు తాళ్ల నవీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 వ తేదీ నుండి మండలంలోని అన్ని గ్రామాలలో ప్రతి కుటుంబం యొక్క పూర్తి వివరాలను సర్వే చేయడానికి అధికారులు వస్తున్నారని వారందరికీ మండల ప్రజలు సహకరించి మీ కుటుంబ సభ్యుల వివరాలను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వనపర్తి నవీన్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అప్పం కుమారస్వామి గ్రామ ప్రధానకార్యదర్శి జీల శ్రీనివాస్, గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపెల్లి యుగేందర్, ఇందిరమ్మా కమిటీ సభ్యులు రావుల సురేష్, దుప్పటి సదానందం, జీల కుమార్, నీలాటి రజిత, అప్పం రేణుక,బూత్ సభ్యులు దుప్పటి అనిల్, అల్లూరు బాబు, నీరాటి రాములు, అట్టెం బాబు,బుర్ర నరేష్, జంగిలి శ్రీకాంత్, జంగిల్ పరుశురాం దుప్పటి మల్లేష్, అల్లూరి బాబు, కాకి బద్రి పాల్గొనడం జరిగింది.