సూర్య జ్యోతి, నవంబర్ 02, సదాశివపేట : శ్రీశైల సూర్య సింహాసనాదీశ్వర శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురువులో డాక్టర్ చెన్నా సిద్ధపండితరాధ్య శివాచార్య వాహ స్వామి ఆశీస్సులతో, షటస్థల బ్రహ్మ శివాచార్య మహాస్వాముల, పూజ్య శ్రీ స్వాముల నేతృత్వంలో వీరశైవ సమాజం, ఎడ్ల బజార్ ఆధ్వర్యంలో 3-11-2024 ఆదివారం ఉదయం 9:30 నుంచి 5:00 వరకూ నిర్వహించబడుతున్న వీరశైవ సాహిత్య సదస్సుకు అందరూ కూడా తరలి రావాలని వీరశైవ సమాజం, ఎడ్ల బజార్ అధ్యక్షులు గందిగే రాజు తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శ్రీశైల జగద్గురువు గారి సాన్నిధ్యం లోనిర్వహించబడే సాహిత్య సదస్సు సదాశివపేట పట్టణం వీరశైవ సమాజం ఎడ్ల బజారు వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరుగుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ అన్మిశెట్టి జయప్రకాష్ అన్నారు. ఈ సదస్సు లో ప్రమూఖ వక్తలు,ప్రవచన కర్తలచే ప్రవచనం,మరియు పత్ర సమర్పణాది కార్యక్రమాలు ఉంటాయని ఈ కార్యక్రమంలో పూజ్య గురువులు స్వాములు పాల్గోననున్నారు.అని సమాజం నిర్వాహకులు తెలియజేశారు.