ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం
– రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ధర్మ యుద్ధం..
– డిసెంబర్ 21నమాదిగల ధర్మయుద్ధ మహాసభ విజయవంతం చేయండి
– నద్దునూరి రఘు మాదిగ మండల అధ్యక్షులు
సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి టి రాజగోపాల్
సూర్య జ్యోతి, నవంబర్ 22 : చౌల్లపెల్లి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల గణేష్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నద్దునూరి రఘు మాదిగ హాజరై మాట్లాడుతూ ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తూ నిండు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని అవసరమైతే ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అన్నారు. నాలుగు నెలలు గడిచినా కూడాఎస్సీ వర్గీకరణ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడక పోవడం మాదిగ జాతిపై చిత్తశుద్ధి లేదని నిదర్శనంగా రేవంత్ రెడ్డి సర్కారు కపట ప్రేమ చూపిస్తుంది. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అతిపెద్ద పోరాటానికి శ్రీకారం చుడుదామని రేవంత్ రెడ్డి సర్కార్ పైన యుద్ధం చేస్తాం ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం అన్నారు. రానున్న రోజులలో ప్రతి గ్రామ గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ . పునర్నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కేంద్రంగా. లక్షలాది మాదిగల ధర్మయుద్ధ మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మార్పీఎస్ చౌల్లపెళ్లి గ్రామ కమిటీని నియమించడం జరిగింది. ఎం ఆర్ పి ఎస్ చౌల్లపల్లి అధ్యక్షులు గా కుక్కముడి ప్రదీప్ మాదిగ ప్రధాన కార్యదర్శి గా మారపెల్లి లక్ష్మణ్ మాదిగ ఉపాధ్యక్షులుగా కొనగని నగేష్ మాదిగ కోనగని లింగయ్య మాదిగ కార్యదర్శి గా కుక్కమూడి చిన్న రాజు మాదిగ చిలుక చిరంజీవి మాదిగ సురేష్ మాదిగ ఈ కార్యక్రమంలో జన్ను కుమార్ మాదిగ, కుక్కమూఢి రాజు మాదిగ, మడిపెల్లి సురేష్ మాదిగ, కుక్కాముడి రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు.