నీరుకుళ్ళలో ఘనంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి టి రాజగోపాల్
సూర్య జ్యోతి, నవంబర్ 8, హనుమకొండ జిల్లా : ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఆర్షం అశోక్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి కోడేపాక కుమార స్వామి గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం రాజు సీనియర్ నాయకులు పొనుగోటి సత్యం ఆర్షం అనిల్ గ్రామ యూత్ పార్టీ అధ్యక్షుడు పిట్టల రాజ్ కుమార్ శ్రవణ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.