పంచకూట శివలింగాలను దర్శించుకున్న చల్లా దంపతులు
సూర్యజ్యోతి, ఆత్మకూర్ మండల్ రిపోర్టర్ : ఆత్మకూరు మండలంలో ఆత్మకూరు గ్రామంలో పంచకోట శివలింగం ప్రతిష్టాపన ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది మూడు రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాలు విపరీతమైన జనాలు దర్శనం కోసం పోటెత్తినారు అందులో భాగంగా ఈరోజు పంచకోట శివలింగాలను మాజీ ఎమ్మెల్యే చల్లా దంపతులు శివుని దర్శనం చేసుకున్నారు. ఆత్మకూరు మండల ప్రజలకు ఆత్మకూరు ప్రజలకు శివుని ఆశీస్సుతో ఎప్పుడూ ఉండాలని వారంతా ఆయురారోగ్యాలతోటి సుఖసంతోషాలతో ఉండాలని చల్లా దంపతులు ఆ శివున్ని కోరుకున్నారు.