విలేకరుపై దౌర్జన్యం కేసులో ఇద్దరికీ రిమాండ్
సూర్య జ్యోతి రిపోర్టర్, నవంబర్ 09 : రామసముద్రం మండలం కురిజల గ్రామంలో వివాదాస్పదంగా మారిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం భూముల విషయమై తేదీ 06/11/2024 వేలం వేయుటకు వచ్చిన ఈవో గారిని అడ్డగించి సదరు విషయాన్ని వీడియో తీసిన విలేకరు పై దౌర్జన్యం చేసిన కేసులో సి.చెంగారెడ్డి s/o తిప్పన్న, సి.గోపాల్ s/o తిప్పన్న లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు రామసముద్రం ఎస్సై సి వెంకటసుబ్బయ్య గారు తెలిపారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ నిమిత్తం కృషి చేస్తున్న విలేకరులు పై దాడి చేయడం అమానుషం. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరడమైనది.