అక్రమ అరెస్టులను కండిస్తున్నాం – బిఆర్ఎస్ పార్టీ ఆత్మకూరు మండల కమిటీ
సూర్య జ్యోతి రిపోర్టర్ పి రాజకుమార్
సూర్య జ్యోతి, నవంబర్ 19 : వరంగల్ జిల్లా కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నాడని సర్పంచ్ లకు రావలిసిన బిల్లుల గురించి ఎక్కడ ఆందోళన చేస్తారోనని ఆత్మకూరు పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం సరికాదని బిఆర్ఎస్ ఆత్మకూరు మండలం పార్టీ నిరసన వ్యక్తం చేసింది. మండలంలోని బి ఆర్ ఎస్ పార్టీ సర్పంచ్ లను అర్ధరాత్రి నిద్రలోంచి లేపి అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని, ఇలా దౌర్జన్యంగా అరెస్టు చేస్తే గ్రామాల్లో ప్రజలు తిరుగబడతారని, బేషరతుగా వారిని విడుదల చేయాలని ఆత్మకూరు మండల బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.