బాలానగర్ డిసిపి పరిధిలో మెగా హెల్త్ క్యాంప్….
ప్రారంభించిన బాలనగర్ డిసిపి సురేష్ కుమార్…
సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి టి రాజగోపాల్
సూర్య జ్యోతి, నవంబర్ 21, హైదరాబాద్ : వివేకానంద నగర్ లోని రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా హెల్త్ క్యాంప్ ను బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ ప్రారంభించారు ఈ మెడికల్ క్యాంపులో అన్ని విధాల టెస్టులతో పాటు క్యాన్సర్ టెస్టులు కూడా చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు బాలనగర్ డిసిపి పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది కుటుంబ సభ్యులకు మూడు రోజులపాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డిసిపి సురేష్ కుమార్ మాట్లాడుతూ బాలనగర్ డి సి పి పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ ల సిబ్బంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.