శివయ్య పాటతో భక్తులను ఆకట్టుకున్న ఆటో డ్రైవర్
– ఆలయ కమిటీ చేతుల మీదుగా పాటను విడుదల చేసిన ఆటో డ్రైవర్ కాడబోయిన మొగిలి
సూర్యజ్యోతి ఆత్మకూరు మండల్ రిపోర్టర్
సూర్యజ్యోతి, ఆత్మకూరు, నవంబర్ 08 : ఆత్మకూరు మండలంలోని కాకతీయుల నాటి పంచకుటా శివాలయ ప్రతిష్ఠాపనలో భాగంగా శివ భక్తులను ఆకర్షించుకునే తీరులో ఆటో డ్రైవర్ కాడబోయిన మొగిలి శివయ్య పాట విడుదల చేసి శివ భక్తులను ఆకర్షించుకున్నారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని నూతన పంచకుటా శివాలయ ప్రతిష్ఠాపనలో భాగంగా శివాలయ కమిటీ సభ్యులతో కలిసి వేద పండితుల చేతుల మీదుగా శివయ్య పాటను విడుదల చేసి శివ భక్తులను మైమరిపించారు. అనంతరం కాడబోయిన మొగిలి మాట్లాడుతు తన సొంత ఖర్చుతో పాట వ్రాసి కంపోసింగ్ చేసి పడటం జరిగిందని తెలిపారు. నాలాంటి ఎంతోమంది టాలెండ్ వ్యక్తులు సొసైటీలో ఉన్నారని వారిని గుర్తించి ఉన్నత స్థాయికి ఎదిగేటట్టు ప్రజలు సహకరించాలని అన్నారు.