సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి టి రాజగోపాల్
సూర్య జ్యోతి, నవంబర్ 5, హైదరాబాద్ : కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న రాజు అనే వ్యక్తిని కూకట్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గవర్నమెంట్ జూనియర్ కళాశాల సమీపంలో బస్ స్టాప్ వద్ద సోమవారం సాయంత్రం నిందితుడిని అదుపులోకి తీసుకొని 2.3 కిలోల గంజాయిని సీజ్ చేసి స్వాధీన పరుచుకున్నారు. అనంతరం రాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో రాజుపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసు విషయమై అరెస్టు అయి జైల్లో ఉండి మూడు నెలల క్రితమే బయటికి వచ్చినట్లు కూకట్ పల్లి పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.