సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి టి రాజగోపాల్
సూర్య జ్యోతి, నవంబర్ 5 : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో నాసిరకం బ్యాటరీలను వాడుతున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన సునీల్ అనే వ్యక్తి నాసిరకం బ్యాటరీ పై వినియోగ దారుల కోర్టులో ఫిర్యాదు చేశారు. దీని పై విచారణ జరిపి కోర్టు నోటీసులు ఇచ్చినా ఓలా సంస్థ పట్టించుకోలేదు. దీంతో రూ.1.73 లక్షలు జరిమానా చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఓలాను ఆదేశించింది. అతను పడిన మానసిక క్షోభకు రూ.10 వేలు అదనంగా చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది.