సూర్య జ్యోతి, నవంబర్ 04, సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయితీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం జెఎసి మెరుపు ధర్నా చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ధర్నాలో పాల్గొనకుండా తాజా మాజీ సర్పంచులను ప్రభుత్వం ఎక్కడికి అక్కడ ముందస్తు అరెస్టులు తెల్లవారుజాము నుండి చేయడం జరిగింది. ఈ సంధర్బంగా అరెస్ట్ అయిన తాజా మాజీ సర్పంచులు పబ్బతి లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, పెద్ద గొల్ల శ్రీహరి, కుమార్ లు మాట్లాడుతూ ఇలా అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు అని, ఎన్నో ప్రయాసలు పడి గ్రామ అభివృద్దికి సహకరిస్తే ప్రభుత్వం మారగానే పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం తగదని, చాలా మంది సర్పంచులు అప్పులు చేసి అభివృద్ది చేసారని వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో లక్షల కోట్లు దోచే కార్యక్రమం పెట్టుకున్నారని, కాని మా బిల్లులు మాత్రం చెల్లించట్లేదని మొర పెట్టుకున్నారు. మాకు చెల్లించిల్సిన నిధులు గత ప్రభుత్వం ట్రెజరీ లో ఉంచితే ఆ డబ్బులన్ని మంత్రుల ఖాతల్లోకి బదిలీ చేశారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాజా మాజీ సర్పంచులను లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, కుమార్ లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పంచాయతీ బిల్లులను వెంటనే విడుదల చేయాలి – సర్పంచ్ ల ఫోరమ్ మాజీ అధ్యక్షుడు పబ్బతి లక్ష్మారెడ్డి.
Date: