సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident ) చోటుచేసుకున్నది. కోదాడలోని కట్టకొమ్ముగూడెం వద్ద ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో 30 మందికి గాయాలయ్యాయి.
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident ) చోటుచేసుకున్నది. కోదాడలోని కట్టకొమ్ముగూడెం వద్ద ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో 30 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న మహి ట్రాన్స్ బస్సును డ్రైవర్ రోడ్డు పక్కకు ఆపాడు. అదే క్రమంలో వెనుక నుంచి వస్తున్న బీహెచ్‌ఈఎల్ డిపోకు చెందిన టీఎస్ 9 జెడ్ 7818 సూపర్ లగ్జరీ బస్సు దానిని వేగంగా ఢీకొట్టింది. దీంతో ప్రైవేటు బస్సు వెనక, ఆర్టీసీ బస్సు ముందు భాగం ధ్వంసమయ్యాయి. 28 మందికి స్వల్ప గాయాలవగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.