సూర్యజ్యోతి ప్రతినిధి, భీమదేవరపల్లి, నవంబర్ 4 : 2019 నుండి 2024 వరకు తెలంగాణ రాష్ట్రం లో పనిచేసిన సర్పంచు లకు డాదాపు 1300 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన పాపం గత పదేళ్లు పాలించిన గత పాలకులది అని జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు, జిల్లా సీనియర్ నేత కేతిరి లక్ష్మారెడ్ఢి పేర్కోన్నారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 చివరిలో గ్రామాలలో గెలిచిన సర్పంచు లను అప్పటి ముఖ్యమంత్రి వివిధ టార్గెట్లు, గడువులు పెట్టి వారిచేత గ్రామాలలో సీసి రోడ్లు, వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణం పేరుతో బలవంతంగా పనులు చేయించింది అన్నారు. ఒకవేళ ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చేయలేక పోతే సస్పెండ్ చేస్తామని బెదిరించి మరీ పూర్తి చెయ్యాలని ఒత్తిడి తెచ్చిన కారణంగా అందిన కాడల్ల అప్పులు తెచ్చారని, కొందరు సర్పంచులు భార్య ఒంటి మీదున్న నగలు కూడ తాకట్టు పెట్టి పనులు పూర్తి చేశారనీ ఆయన గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు లక్షకోట్లు ఖర్చు పెట్టి నాళేశ్వరం పేరిట ప్రజా ధనం గోదావరి నది పాలు చేశాడని ఘాటుగా విమర్శించారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్ లకు 1300 కోట్ల రూపాయల మేర బాకాయిలు పెట్టాడని చెప్పారు. అలాంటి భారాస నేతలు ఇప్పుడేమో బకాయిలు విడుదల చేయాలని సెక్రటేరియట్ ముట్టడి పేరిట సర్పంచుల ను రెచ్చగొట్టి రాక్షసానందం పొందడం సిగ్గుచేటన్నారు. గురివింద గింజ తన కిందున్న నలుపుని తను ఎరగదు అంటే ఇదేనేమో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లక్ష కోట్లు పెట్టి కూలిపోయే ప్రాజెక్ట్ కట్టిన కెసిఆర్ సర్పంచులకు 1300 కోట్లు బకాయిలు పెట్టడం వెనుక మతలబు ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు.
సర్పంచు లకు 1300 కోట్ల పాత బకాయిల పాపం గత సర్కారు దే – కాంగ్రెస్ జిల్లా నేత కేతిరి లక్ష్మారెడ్ది
Date: