ఘనంగా టీడీపీ సభ్యత నమోదు పండుగ
సూర్యజ్యోతి ఆత్మకూరు మండల రిపోర్టర్, నవంబర్ 06 : ఆత్మకూరు మండల కేంద్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించిన పరకాల నియోజకవర్గం బాద్యులు కందుకూరి నరేష్ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఆనాడు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఘనత, మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించిన ఘనత ఎన్టీఆర్ దే, ఆ తర్వాత పార్టీ కార్యకర్తలకు సంక్షేమ నిధి నుండి సభ్యత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుంది,గతంలో రెండు లక్షలన్న ఇన్సూరెన్స్ ను ఈరోజు 5 లక్షలకు చేసిన ఘనత చంద్రబాబుది సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు,హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం కార్యకర్తల పిల్లలకు స్కూల్లో చదువు కల్పించడం, చదువుకున్న నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ నుంచి శిక్షణ ఇచ్చి ఉద్యోగ కల్పన చేయడము, కార్యక్రమంలో ఆత్మకూరు మండల అధ్యక్షులు, గోనె మధుకర్ పెండ్లి రమణ,మరిగిద్ది రాజేశ్వరరావు, సిద్దోజ రాజమౌళి,సీనియర్ నాయకులు చిదురాల రామన్న,కొక్కరకొండ కుమారస్వామి, సురేష్,పాల్గొన్నారు.